మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో భారీ వర్షం

ప్రచురణ తేదీ: గురువారం, 10 సెప్టెంబర్ 2026

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి.

ఈ ఏడాదిలో విజయవాడలో ఇప్పటివరకు నమోదైన వర్షాల్లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.