బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం లభించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం అంతర్జాతీయంగా బహుళపక్ష సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచే దిశగా డిక్లరేషన్ కీలక అడుగు అని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో ఈ అంశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రిక్స్ వేదిక ద్వారా భారత్ తన ఆలోచనలు, సామర్థ్యాలను ప్రపంచానికి మరింత బలంగా చాటుకునే అవకాశం లభిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.







