మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్, రాజకీయాలు

స్థానిక ఎన్నికలపై వైసీపీలో వణుకు మొదలైంది: CBN

ప్రచురణ తేదీ: మంగళవారం, 1 సెప్టెంబర్ 2026

AP: వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ఎన్నికలను అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. SIR తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వైకాపా కోరుతోందని, ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని వారు అంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటే వైసీపీ ఏం చేయగలదని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లో నేతల మార్పుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.