ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ రంగంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ముందుకు సాగుతూ ధైర్యవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజా సేవలో పవన్ కల్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుతూ చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.







