మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తీవ్ర విమర్శలు

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

AP: నగరి మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తీవ్ర విమర్శలు చేశారు. రోజా ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని, ఆమె ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని విమర్శించారు.

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో రోజా స్వయంగా చెర్లోపల్లి క్వారీలకు అనుమతులు ఇచ్చారని గాలి భాను ప్రకాష్ ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అదే అంశానికి సంబంధించి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇటీవల రోజా చేసిన హంగామా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని ఆయన విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకుల్లో సహనం తగ్గిపోయిందని, ప్రజల దృష్టిని ఇతర అంశాల నుంచి మళ్లించేందుకు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పేర్కొన్నారు.