మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు డ్రామాలు మానేసి పోలవరం పనులపై దృష్టి పెట్టాలి: జగన్

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

AP: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రచారానికి స్వస్తి చెప్పి పనులపై దృష్టి పెట్టాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి, పోలవరం నీటిని తీసుకొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలవరం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా నీరు వస్తున్నట్లు చెప్పడం సరికాదని జగన్ పేర్కొన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు, దానికి సంబంధించిన పంపులను వైఎస్సార్‌ హయాంలోనే నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు క్రెడిట్‌ తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి, పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.