AP: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని మంత్రులకు సూచించారు. ప్రజలపై ధరల భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.







