మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో అక్టోబర్‌ నుంచి కొత్త పింఛన్లు

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

AP: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సామాజిక పింఛన్ల మంజూరుపై దృష్టి సారించింది. సెప్టెంబర్‌లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి, అక్టోబర్‌ నుంచి తొలి విడతలో వితంతువులు, వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలుత సుమారు 1.5 లక్షల మంది వితంతువులకు నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్ల దరఖాస్తులు ఈ నెలలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించే అవకాశం ఉంది.