మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

మీ ప్రేమ, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

AP: తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు అందించిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు చెప్పారు.

తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానం, నమ్మకం తన బాధ్యతను మరింత పెంచిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ ప్రజాసేవలో మరింత శక్తితో ముందుకు సాగేందుకు ప్రేరణ, బలాన్ని ఇస్తాయని తెలిపారు.