మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్

రాజోలులో వైకాపా జెండా దిమ్మను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026

రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వైకాపా పార్టీ జెండా దిమ్మ పూర్తిగా ధ్వంసమైన ఘటన చోటుచేసుకుంది. రాజోలు మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వైకాపా నాయకులు తెలిపారు.

వాహనం ఢీకొన్న ప్రభావంతో జెండా దిమ్మ దెబ్బతినడంతో పాటు, దాని వెనుక ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కింద ఉన్న సిమెంట్ దిమ్మకు అమర్చిన టైల్స్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

ఘటనపై వైకాపా రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

జెండా దిమ్మను ఢీకొట్టిన వాహనం ఏదనేది, దానిని నడిపిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా వాహనాన్ని గుర్తించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది