AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. జగన్ పాదయాత్రకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు.
గతంలో చంద్రబాబు నాయుడు మంచితనాన్ని చూసే జగన్ పాదయాత్ర చేశారని చింతమనేని ప్రభాకర్ అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని, పాదయాత్రకు వస్తే జగన్ సంగతి, ఆయన కథ ఏంటో తేలుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ 2027 నుంచి పాదయాత్ర చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, చంద్రబాబు ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే చింతమనేని ప్రభాకర్ జగన్పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.







