మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
సినిమా

అందుకే చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టా: సమంత

ప్రచురణ తేదీ: శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026

నటి, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం వ్యాపారవేత్తగానూ కొనసాగుతున్నారు. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల కారణాన్ని తాజాగా ఆమె వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఇతర రంగాలపై దృష్టి సారించాలని భావించినట్లు తెలిపారు.

వైద్యుల సూచన మేరకు కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సమంత చెప్పారు. ఆ సమయంలో తనకు నమ్మకం ఉన్న పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.

‘సిటాడెల్‌’ షూటింగ్‌ సమయంలోనూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. అయితే చిత్రబృందం కోరడంతో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చెప్పారు. ఇక ‘మా ఇంటి బంగారం’ సినిమాలో మొదట నిర్మాతగానే కొనసాగాలని అనుకున్నానని, అయితే రాజ్‌ ప్రోత్సాహంతో నటించేందుకు అంగీకరించినట్లు సమంత వెల్లడించారు.