మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
సినిమా

ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న ‘ది ప్యారడైజ్’

ప్రచురణ తేదీ: శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026

నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్ విక్రయాలు 1.40 లక్షల డాలర్ల మార్క్‌ను దాటాయి. ఇప్పటివరకు 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదలకు ముందే ఓవర్సీస్‌లో ‘ది ప్యారడైజ్’ చూపిస్తున్న జోరు చూస్తుంటే.. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందోననే ఆసక్తి మరింత పెరుగుతోంది.