AP: గిరిజన బాలలకు మెరుగైన విద్య, వసతులు అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగా CSR నిధులతో రూ.1 కోటి వ్యయంతో 25 అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించనున్నారు. పిల్లలకు మెరుగైన వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన అవకాశాలు కల్పించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.







