మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
అంతర్జాతీయం, ఆరోగ్యం, బ్రేకింగ్ న్యూస్

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3,000 దాటిన మరణాలు

ప్రచురణ తేదీ: బుధవారం, 2 సెప్టెంబర్ 2026

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి ఇప్పటివరకు ఎబోలా బారినపడి 3,007 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 6,186 ఎబోలా కేసులు నమోదైనట్లు తెలిపారు.

దేశంలోని ఆరు ప్రావిన్స్‌లకు వైరస్ విస్తరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎబోలా కేసులను సకాలంలో గుర్తించడం, బాధితులను చికిత్స కేంద్రాలకు తరలించడం సవాలుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. నమోదైన మరణాల్లో దాదాపు 60 శాతం చికిత్స కేంద్రాల వెలుపలే సంభవించినట్లు WHO అంచనా వేసింది.