TG: హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డ్ మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఖాజాగూడలో బీహార్‌కు చెందిన నందులాల్ రోడ్డు దాటుతుండగా అతడిని కారు ఢీకొట్టింది. గాయపడిన నందులాల్‌ను జైద్ షా ఖాద్రీ అనే వ్యక్తి తన కారులో కారులోకి ఎక్కిస్తుండగా సందీప్ కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో నందూ మరణించగా జైద్ షా గాయపడ్డాడు. పరారీలో ఉన్న సందీప్‌ను పోలీసులు CCTV ఫుటేజీ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు.
హిట్ అండ్ రన్ కేసు.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్
ప్రచురణ తేదీ: మంగళవారం, 1 సెప్టెంబర్ 2026







