మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
తెలంగాణ

సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. రికార్డ్ అసిస్టెంట్ మృతి

ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగరేణి క్వార్టర్స్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పుల వేణు కుమార్ అనే వ్యక్తి మృతి చెందారు.వేణు కుమార్ బైక్‌పై వెళ్తుండగా సింగరేణి క్వార్టర్స్ సమీపంలోని స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి కిందపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.మృతుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.