మంగళవారం, 13 అక్టోబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్
తెలంగాణ

దుమ్ముగూడెం నుంచి గోవుల అక్రమ తరలింపు…

ప్రచురణ తేదీ: శుక్రవారం, 4 సెప్టెంబర్ 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నుంచి బొలెరో దోస్త్ వాహనంలో గోవులను ఈరోజు బంజర సంతకు తరలిస్తున్నట్లు సమాచారం. స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద బ్లూ కోట్ పోలీసులు వాహనాన్ని గుర్తించి గోవులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవులతో పాటు వాహనాన్ని భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోవుల తరలింపునకు అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.